![మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి భాస్కర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/26/25nzr177-250075_mr_0.jpg.webp?itok=rO6BCdcK)
మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి భాస్కర్
ధర్పల్లి: ప్రజాసంఘాల నాయకులపై రాజద్రోహం, ఉపా కేసులు పెట్టడం సరికాదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులపై ప్రభుత్వాలు నిర్బంధం విధించడం సరికాదన్నారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, హరగోపాల్‌తో పాటు 152 మందిపై పెట్టిన ఉపా కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం తప్పదన్నారు. ఏఐకేఎంఎస్ మండలాధ్యక్షుడు ఊశన్న, ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేశ్వర్, గంగారెడ్డి, గంగాధర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment