![మోపాల్‌లో సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు, కారోబార్లు - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/24/23nzt703-250041_mr_0.jpg.webp?itok=uA9ulquX)
మోపాల్‌లో సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు, కారోబార్లు
మోపాల్ (నిజామాబాద్‌రూరల్): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని యూనియన్ అధ్యక్షుడు ధర్మానంద్ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలకేంద్రంలో జీపీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ధర్మానంద్ మాట్లాడుతూ జీపీ కార్మికులు చేసిన సేవలు మరువలేనివని, కానీ వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. స్వీపర్లకు రూ.15,600, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు రూ.19,500 వేతనం చెల్లించాలని, సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్‌చేశారు. ప్రమాదబీమా రూ.10లక్షలు, సాధారణ మరణానికి రూ.5లక్షల బీమా చేయించాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు, కారోబార్లు శ్రీనివాస్, మహిపాల్, శ్రీను, సావిత్రి, దశరథం, భూలక్ష్మీ, అజయ్, పోశెట్టి, అరుణ్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment