ఆర్మూర్‌లో బైక్‌ చోరీకి యత్నం | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌లో బైక్‌ చోరీకి యత్నం

Published Mon, May 6 2024 5:55 AM

ఆర్మూర్‌లో బైక్‌ చోరీకి యత్నం

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని బైక్‌ చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. పట్టణంలోని జంబిహనుమాన్‌ ఆవరణలో ఉన్న గంథ్రాలయం ఎదుట నిలిపి ఉంచిన పాఠకుడి బైక్‌ను వేల్పూర్‌కు చెందిన శివ చోరీకి పాల్పడి పారిపోతుండగా స్థానికులు వెంబడించి పెర్కిట్‌ వద్ద పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు.

గడువు ముగిసిన

కూల్‌ డ్రింక్స్‌ విక్రయం

రుద్రూర్‌: పొతంగల్‌ మండలం కల్లూర్‌లో గడువు ముగిసిన కూల్‌ డ్రింక్స్‌ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూల్‌ డ్రింక్స్‌ తాగడానికి వచ్చే వారికి వ్యాపారులు ఇదే అదునుగా భావించి అధిక ధరతో పాటు గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ విక్రయిస్తున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రం నుంచి ఇద్దరు పని నిమిత్తం కల్లూర్‌కి రాగా ఓ షాపులో కూల్‌డ్రింక్‌ సేవించారు. తీరా బాటిల్‌పై ఫిబ్రవరికే గడువు ముగిసిన విషయాన్ని గమనించిన వారు యజమానిని ప్రశ్నించారు. సదరు యజమాని దురుసుగా వ్యవహరించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గడువు ముగిసిన కూల్‌డ్రింక్‌ అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement