రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర కాంగ్రెస్‌ది | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర కాంగ్రెస్‌ది

Published Mon, May 6 2024 6:15 AM

రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర కాంగ్రెస్‌ది

సుభాష్‌నగర్‌: యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని, ఓట్ల కోసం రిజర్వేషన్ల తొలగింపు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్‌ ధర్మపు రి పేర్కొన్నారు. నగరశివారులోని వైస్రాయ్‌గార్డెన్‌ లో ఆదివారం మేధావులు, విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా అర్వింద్‌ ధర్మపురి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ వక్ఫ్‌ చట్టాన్ని తెచ్చిందని, ఆ చట్టం ద్వారా అనేకమంది హిందువుల ఆస్తులను ముస్లింలు ఆక్రమించుకున్నారని తెలిపారు. హిందువులకు ప్రస్తుత ఎన్నికలు అతి ముఖ్యమైనవని తెలిపారు. ఈ అంశాలను సమాజంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, దేశ, ధర్మ రక్షకుడైన నరేంద్ర మోదీని మనమందరం బలపర్చి, మూడోసారి ప్రధానిని చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఐఎంఏ హాల్‌లో అసో సియేషన్‌ సభ్యులతో ఎంపీ అర్వింద్‌ సమావేశం నిర్వహించి, మాట్లాడారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నాయకులు, మేధావులు లోక భూపతిరెడ్డి, టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, కొండా ఆశన్న, రజనీష్‌, స్రవంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

Advertisement
Advertisement