ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే పతనం ఖాయం
నిజామాబాద్‌అర్బన్: ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పతనం ఖాయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలోని మర్చంట్ అసోసియేషన్ భవన్‌లో బుధవారం ఉమ్మడి జిల్లా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1965 నాటి రిజర్వేషన్లు ఎస్సీల్లోని అన్ని కులాలకు అందడం లేదని, ఎస్సీ వర్గాల వర్గీకరణ చేయాలని లోకూర్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. ఆ ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేసి సామాజిక న్యాయాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగలు పదేళ్లపాటు ఉద్యమిస్తే కాంగ్రెస్ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే సామాజిక న్యాయ వ్యతిరేకత ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలో ముందు ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్సీ వర్గీకరణ మీద ముందుకు వెళ్లకుండా సీఎంను నియంత్రించిందని ఆరోపించారు. వర్గీకరణ కోసం మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు మండల, గ్రామాల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి, జాతీయ నాయకులు గంగాధర్, యమున, సత్య, లక్ష్మి, సంజీవ్, ఆకారం రమేశ్, పద్మ, సావిత్రి, సుధా, మహే శ్, వెంకట్, రాములు, రమేశ్, నాగరాజు, లావణ్య, సూర్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment