బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
నిజామాబాద్‌నాగారం: బాలల హక్కుల పరిరక్షణ కు అందరూ కలిసికట్టుగా పాటుపడాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారో త్సవాలు ముగింపు కార్యక్రమాన్ని బుధవా రం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పిల్లలకు హక్కులపై అవగాహన క ల్పించాలని, బాల్యం అంటే వారి శారీరక, మానసిక అపరిపక్వత సమయంలో పిల్లల సంరక్షణ కోసం చట్టపరమైన రక్షణ చాలా అవసరమన్నారు.
బాలల హక్కుల్లో భాగంగా జీవించే హక్కు, గుర్తింపు, అభివృద్ధి, విద్య, వినోదం అన్ని రంగాల్లో వారికి తోడ్పాటునందించాలని కోరారు. పిల్లల అక్రమరవాణా, హింస, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి మాట్లాడుతూ.. అమ్మాయిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం తరఫున అందించే ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాలని కోరారు. జిల్లా సంక్షేమ అధికారిణి షేక్ రసూల్ బీ మాట్లాడుతూ జిల్లాల్లో ఆరు చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మానవతాసదన్, బాలసదనం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా న్యాయ సాధికారిక సంస్థ కార్యదర్శి పద్మావతి, డీసీపీ బస్వారెడ్డి, డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజేందర్, స్నేహ సొసైటీ సిద్ధయ్య, సాధన ఎన్జీవో కో ఆర్డినేటర్ మధు, డీసీపీయూ చైల్డ్ లైన్ సిబ్బంది, గుమ్మడి ఫౌండేషన్ సదానందరెడ్డి, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లల సంరక్షణకు చట్టపరమైన రక్షణ అవసరం
జిల్లా జడ్జి సునీత కుంచాల
Comments
Please login to add a commentAdd a comment