రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పిరమిడ్
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పిరమిడ్‌ను ఆర్మూర్‌లోని సిద్ధులగుట్టపై నిర్మిస్తున్నారు. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్టు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫౌండర్ డాక్టర్ సుభాష్ ఆదేశాల మేరకు ఈ నిర్మాణం చేపడుతున్నట్లు పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రూ.70లక్షలు ఖర్చయ్యాయని, మొత్తం రూ.కోటి ఖర్చవుతుందన్నారు. మరో నెల రోజుల్లో నిర్మాణం పూర్తవుతుందని, ఒకేసారి 700 నుంచి వెయ్యి మంది ధ్యానం చేయొచ్చని తెలిపారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment