తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు కుట్ర
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ తరచూ మాజీ సీఎం కేసీఆర్‌ని లేకుండా చేస్తానని అంటున్నారని, తెలంగాణను ఆంధ్రలో కలిపి తాను అనుకున్నది సాధించాలనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఎవరేమీ చేయలేరని, వారిని అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకపోయినప్పటికీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు పురుగుల అన్నం ఇస్తున్నారని, స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు, వేతనాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారన్నారు. మూసీ నదికి ఇచ్చే నిధులతో రాష్ట్రంలో పెన్షన్స్, రుణమాఫీ చేయొచ్చని పేర్కొన్నారు. నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడు, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని, విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని, పక్కా ప్రణాళిక ప్రకారమే శేఖర్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు సుజిత్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌ను ఎవరేమీ చేయలేరు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment