తహసీల్ ఆఫీస్‌లో షాడో అధికారి
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని నార్త్ రెవెన్యూ కార్యాలయంలో ఓ వ్యక్తి షాడో అధికారి అవతారం ఎత్తాడు. ఆఫీస్‌లోని ఓ అధికారి బంధువు అయిన సదరు వ్యక్తి కార్యాలయానికి వచ్చే వారి వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఏ పని కావాలన్నా ఆయనను కలవాల్సిందే అని విధంగా పరిస్థితి తయారైంది. కార్యాలయంలో ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసుకొని పనులు చక్కబెడుతున్నాడు. సంబంధిత అధికారి మాత్రం అక్కడ అందుబాటులో ఉండరు. కార్యాలయానికి వచ్చే వారు సదరు అధికారి బంధువును కలిస్తే ఆయన పనులు చేయిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి.
సర్టిఫికెట్ల కోసం..
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఈ కార్యాలయానికి వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సర్టిఫికెట్ మంజూరు చేయడంలోనూ సదర్ షాడో అధికారి రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగింది. ఈ వ్యవహారంలో కొందరు అభ్యర్థుల నుంచి నేరుగా దరఖాస్తులు తీసుకున్న వీరు కార్యాలయంలోనే ఓటర్ నమోదు ప్రక్రియను చేపట్టారు. దీనికోసం ఒక్కో అభ్యర్థికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా సదరు అధికారికి కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులు సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. వీరి వసూళ్ల పర్వానికి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రధాన కేంద్రంగా మారినట్లు సమాచారం. ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మా బంధువు వస్తాడు కానీ..
కార్యాలయానికి అప్పుడప్పుడు మా బంధువు వస్తుంటాడు. కానీ ఎలాంటి అధికారిక పనుల్లో జోక్యం చేసుకోడు. వసూళ్ల పర్వం నిజం కాదు. నిబంధనల ప్రకారమే కార్యాలయ పనులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తాం. – నాగర్జున, తహసీల్దార్
ఏ పని కావాలన్నా ఆయనను
కలవాల్సిందే..
వివాదాస్పదంగా అధికారి
బంధువు తీరు
కార్యాలయంలో కుర్చీ వేసుకొని పనులు
డబ్బులు ఇస్తేనే పనులు
తహసీల్ కార్యాలయంలోని సదరు షాడో అధికారికి డబ్బు ఇస్తేనే పనులు అవుతాయి. ఇటీవల ఐదుగురు ప్రభుత్వ టీచర్లు నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చారు. ఆ స్థలంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సవరించి రిజిస్ట్రేషన్ కావాలంటే ముడుపులు ఇవ్వాలని షాడో అధికారి చెప్పాదు. అనంతరం నగరంలోని ఓ హోటల్లో సదరు టీచర్లను కలిసిన షాడో అధికారి వారి నుంచి రూ.2.5 లక్షలు తీసుకొని ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. అలాగే ఓ వ్యక్తి నాలా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా ఎకరాకు రూ.12 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. కాగా సంబంధిత అధికారి మాత్రం సాయంత్రం వేళ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాల పనివేళల్లో అతని బంధువే ఆఫీస్‌లో వ్యవహారాలు చక్కబెడతారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment