తెరుచుకున్న డాక్యుమెంట్ రైటర్ల దుకాణాలు
సుభాష్‌నగర్ : నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయ దస్తావేజు లేఖర్ల దుకాణాలు బుధవారం తెరుచుకున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఇబ్బంది పెడుతున్నారంటూ 9 రోజులుగా దుకాణాలు మూసి ఉంచారు. దీంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. అయితే సబ్ రిజిస్ట్రార్ నాలుగు రోజులు సెలవులో వెళ్లారు. ఇన్‌చార్జిగా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. దస్తావేజు లేఖర్లు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేయించారు. బుధవారం ఒక్కరోజే 40 వరకు సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్‌గేజ్, తదితర డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. చాలా రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లతో సందడిగా మారింది.
నేడు పోలీస్ పాసింగ్ అవుట్ ప్రోగ్రామ్
ఖలీల్‌వాడి : ఎడపల్లి మండలం జాన్కంపేట్ వద్ద గల సీటీసీ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ ప్రోగ్రామ్ గురువారం నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ వస్తున్నట్లు పేర్కొన్నారు.
టీఎన్జీవోస్ కార్యాలయంలో
గ్రీవెన్స్ సెల్
ఆర్మూర్ : జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై చ ర్చించి పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ తెలిపారు. ఆర్మూర్ టీఎన్‌జీవోస్ భ వన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బు ధవారం నిర్వహించారు. గ్రీవెన్స్ సెల్‌లో తె లియజేసిన సమస్యలను రెండు, మూడు రో జుల్లో పరిష్కరించడానికి కృషి చేస్తామని హా మీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన సు మన్, శేఖర్‌ను ఆర్మూర్ యూనిట్ తరఫున సన్మానించారు. పోల శ్రీనివాస్, దినేష్ బాబు, వేణుగోపాల్, గంగకిషన్, జాఫర్ హుస్సేన్, అతిక్ హుస్సేన్, ఆకుల ప్రసాద్, వనమాల సుధాకర్, షికారి రాజు, గోవర్ధన స్వామి పాల్గొన్నారు.
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి
జక్రాన్‌పల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌లో కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా పడేలా చూడాలని సూచించారు. కేంద్రంలో తూకం వేసిన ధాన్యం వివరాలు ఆరా తీశారు. కేంద్రం నుంచి ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఏవో దేవిక, ఏఈవో సుభాష్య, అర్గుల్ సొసైటీ కార్యదర్శి తిరుపతిరెడ్డి ఉన్నారు.
కళాయాత్రను విజయవంతం చేయాలి
నిజామాబాద్ అర్బన్ : రాష్ట్రంలో ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 7 వరకు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కళాయాత్ర ప్రదర్శనల వాహనాన్ని కలెక్టర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రచారం చేయనున్నారు. డీపీఆర్‌వో ఎన్ పద్మశ్రీ, కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment