ప్రశాంత్‌రెడ్డీ.. రాజీనామాకు సిద్ధంగా ఉండు!
నిజామాబాద్ సిటీ : ‘ప్రశాంత్‌రెడ్డి రాజీనామాకు సి ద్ధం ఉండు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చకు మేం సిద్ధం.. స్థలం, తేదీ నువ్వే చెప్పు.. బీఆర్‌ఎస్ పాలనపై కూడా చర్చిద్దాం’ అని బాల్కొండ ఎమ్మె ల్యే ప్రశాంత్‌రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహ న్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో మంత్రిగా ప్రశాంత్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. మైక్‌లు ముందున్నా యని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మర్యాదకాదన్నారు. మొన్న భీమ్‌గల్‌లో లింబాద్రి గుట్టపై కూడా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ముందుగా ఎమ్మెల్యే పదవికి ప్రశాంత్‌రెడ్డి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని, డబుల్ బెడ్‌రూమ్‌లు ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌక ర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపు వంటివి చేశామన్నారు.
మేయర్ భర్తపై దాడితో సంబంధం లేదు
నగర మేయర్ దండు నీతు కిరణ్ భర్త శేఖర్‌పై దా డిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు పేర్కొన్నారు. దాడితో కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ అంతర్గత పోరుతోనే ఈ దా డి జరిగినట్లు బయట ప్రచారం జరుగుతుందన్నా రు. దాడి చేసిన వ్యక్తి రసూల్ మేయర్ భర్తతో సరదాగా ఉన్న వీడియోను ఆయన చూపెట్టారు. నాగారంలో పేదల భూములు, ఇంటి స్థలాలు పెద్ద సంఖ్యలో కబ్జాకు గురయ్యాయన్నారు. పేదల భూము లు కబ్జా చేసిన వారిని పోలీసులకు కఠినంగా శిక్షించాలన్నారు. ఆక్రమణకు గురైన బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాడి విషయంలో కాంగ్రెస్‌పై బురద చల్లడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, కార్పొరేటర్ గడుగు రోహిత్, నాయకులు వేణురాజ్, జావేద్ అక్రం, నరేందర్‌గౌడ్, దయాకర్, రేవతి, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.
హామీలపై చర్చిద్దాం రా..
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment