పడిపోయిన ‘పల్లి’ ధర
బాల్కొండ : పల్లికాయ ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి రావడంతో నెల రోజుల నుంచి పల్లికాయను వెలికి తీస్తున్నారు. సీజన్ ప్రారంభంలో 80కిలోల పల్లి కాయల బస్తా రూ.మూడు వేలు పలికింది. తాజాగా వ్యాపారులు బస్తా ధరను రూ.2,100 కు తగ్గించారు. మెండోరా మండలం బుస్సాపూర్‌లో పల్లికాయను అధికంగా సాగు చేస్తారు. ఖరీఫ్‌లో పచ్చి బుట్ట కోసం మక్క సాగు చేసి, ఆగస్టులో పల్లికాయ వేస్తారు. 90 రోజుల వ్యవధిలో పంటను వెలికి తీసి విక్రయిస్తారు. అయితే మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ధర తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధర బాగా తగ్గించారు
పల్లికాయ ధరను ప్రస్తుతం బాగా తగ్గించారు. ప్రా రంభంలో బస్తాకు రూ.3 వేలు చెల్లించిన వ్యాపారులు ప్రస్తుతం రూ.2,100 చెల్లిస్తున్నారు. మార్కెట్ ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ వ్యా పారులు చెప్పిన ధరకే విక్రయిస్తున్నాం.
– ముత్యంరెడ్డి, రైతు
ఏపీ, తమిళనాడుకు ఎగుమతి
బుస్సాపూర్‌లో కొనుగోలు చేసిన పల్లికాయను వ్యాపారులు అధికంగా ఆంధ్రపదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చేతికందిన పల్లికాయను అక్కడ అధికంగా వినియోగిస్తారని వ్యాపారులు అంటున్నారు. పక్క రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ఇక్కడ మాత్రం ధరను తగ్గిస్తున్నారు. వ్యాపారులు మార్కెట్‌లో కిలోకు రూ.80కి విక్రయిస్తున్నారు.
బుస్సాపూర్‌లో మార్కెట్
బుస్సాపూర్‌లో పల్లికాయ పంటను అధికంగా సాగు చేస్తారు. దీంతో గ్రామంలోనే మార్కెట్ అందుబాటులో ఉంది. దాదాపుగా పల్లి సాగు అన్ని గ్రామాల్లో కనుమరుగు అయింది. మెండోరా మండల కేంద్ర, బుస్సాపూర్‌లో ప్రస్తుతం అధికంగా వేస్తున్నారు. మార్కెట్ గ్రామంలోనే అందుబాటులో ఉండటంతో రైతులకు కలిసి వస్తుంది.
80 కిలోల బస్తా రూ.2,100
సీజన్ ప్రారంభంలో
రూ.మూడు వేలు పలికిన రేటు
Comments
Please login to add a commentAdd a comment