ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్ అర్బన్ : రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..
ఖలీల్‌వాడి: రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా మంగళవారం డీసీపీలు కోటేశ్వర రావు, బస్వారెడ్డి, శంకర్ నాయక్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఆర్. ఏసీపీ నాగయ్య, సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, వనజరాణి, రిజర్వు సీఐ సతీష్ కుమార్, తిరుపతి, శ్రీనివాస్, శ్రీపాల్, శేఖ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు పురస్కారాలు
ఖలీల్‌వాడి : రీజియన్ పరిధిలో ఉత్తమ ప్రతి భ కనబరిచిన కండక్టర్లు, డ్రైవర్లకు ఆర్‌ఎం జానీరెడ్డి మంగళవారం నగరంలోని డిపో– 1లో ప్రగతి చక్రం పురస్కారాలు అందజే శారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ వి శంకర్, అకౌంట్స్ ఆఫీసర్ సర స్వతి తదితరులు పాల్గొన్నారు.
బ్యాలెట్ విధానం పెట్టాలని
దాఖలైన వ్యాజ్యం కొట్టివేత
నిజామాబాద్‌అర్బన్ : భారత ఎన్నికల్లో పేప ర్ బ్యాలెట్ విధానాన్ని పున: ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిందని క లెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై పి టిషనర్ డాక్టర్ కౌల్ చేసిన వాదనలను న్యా యస్థానం తిరస్కరించిందని పేర్కొన్నారు. పిటిషన్‌ను తిరస్కరించిన సందర్భంగా న్యా యస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని, ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అ స్థిరతను ఎత్తిచూపిందన్నారు. ఈవీఎంల వ్యవస్థతో రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇ బ్బంది లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీ బీ వరాలేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చే సిందని కలెక్టర్ తెలిపారు.
ఇద్దరు డీసీపీల బదిలీ
ఖలీల్‌వాడి : జిల్లాలోని ఇద్దరు డీసీపీలను బ దిలీ చేస్తూ మంగళవారం సాయంత్రం డీజీ పీ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) కోటేశ్వర్ రావును ఎల్‌బీనగర్‌కు బదిలీ చేయగా, అదనపు పోలీస్ కమిషనర్(లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డిని నిజామాబాద్ అడ్మిన్‌గా నియమించారు.
ఆర్‌ఎంపీ, పీఎంపీ
క్లినిక్‌లలో తనిఖీలు
నిజామాబాద్ నాగారం : నగరంలోని ఆర్ ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లలో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైద్య మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు బండారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని 15 క్లినిక్‌లను పరిశీలించారు. సమీర్ రాయ్ ప్రియాంక క్లినిక్, జుగల్రాయ్ దేవిక రాయ్ భారతి క్లినిక్ పేర్లతో కనీస విద్య అర్హత లే కుండా ఆధునిక వైద్యం చేస్తూ విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించా రు. అలాగే పైల్స్‌కు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. నకిలీ వైద్యుల క్లినిక్‌లకు అనుబంధంగా మూడు మెడికల్ దుకాణాల్లో సైతం క్వాలిఫైడ్ డాక్టరు ప్రిస్కిప్షన్ లే కుండా యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. వీరిపై డ్రగ్ కంట్రోల్ అ థారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయనున్నట్లు సభ్యులు తెలిపారు. మెడికల్ కౌన్సిల్ సభ్యులు రాజ్‌కుమార్, విష్ణు, విజయ్ కుమార్ తనిఖీలలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment