వేముల వర్సెస్ మానాల
బీఆర్‌ఎస్ నాయకుల విమర్శలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి వెంటనే ప్రతివిమర్శలు చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై వెంటవెంటనే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు కేబినెట్ బెర్త్ కేటాయించడంలో ఆలస్యమవుతోంది. సీనియర్ నేత పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమైనప్పటికీ అధిష్టానం నుంచి మంత్రివర్గ విస్తరణపై గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉన్న మానాల మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడి హోదాలో బీఆర్‌ఎస్ విమర్శలను బలంగా తిప్పికొడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి అంశంపై మానాల సైతం లెక్కలతో సహా సమాధానాలు ఇస్తున్నారు. నువ్వా? నేనా? అనే స్థాయిలో మానాల దూకుడుగా వ్యవహిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి ఇద్దరూ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వాళ్లే కావడంతో వీరిద్దరి విమర్శలు, ప్రతివిమర్శలు ఆసక్తి రేపుతున్నాయి.
గత శాసనసభ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి విఫలమైన మానాల మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సైతం సన్నిహితుడిగా ఉన్నారు. టిక్కెట్ దక్కకపోవడంతో ముఖ్యమంత్రి కోటాలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, సుంకేట అన్వేష్‌రెడ్డి సైతం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల పదవులు దక్కించుకున్నారు. అయితే నియోజకవర్గంపై ఫోకస్ మాత్రం మానాల మోహన్‌రెడ్డి మాత్రమే చేశా రు. జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూనే బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల బరిలోకి నిలిచేందుకు మానాల మోహన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన కానున్న నేపథ్యంలో అనువైన స్థానం నుంచి బరిలోకి దిగేందుకు మానాల ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేముల వర్సెస్ మానాల అన్నవిధంగా పరిస్థితి తయారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విమర్శలు, ప్రతివిమర్శలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి కేంద్రంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని నిలువరించేందుకు అదేస్థాయిలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాటలదాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రశాంత్‌రెడ్డి ప్రకటించగా, ఏడాదికాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని మానాల మోహన్‌రెడ్డి ప్రకటించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వర్సెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అనేలా మాటల దాడి, ప్రతిదాడి వ్యవహారం నడు స్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడా ది గడిచింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై గత కొన్ని నెలలుగా విమర్శల దాడిని పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, బాల్కొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. రైతు రుణమాఫీ, బోనస్ చెల్లింపులు, ఆరు గ్యారంటీల విషయమై ప్రశాంత్‌రెడ్డి టాప్ గేర్‌లో విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంతోపాటు రెగ్యులర్‌గా జిల్లా కేంద్రంలో పర్యటిస్తూ పార్టీ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విమర్శల దాడిని మరింత పెంచారు. అన్నీతానై ప్రశాంత్‌రెడ్డి జిల్లా పార్టీకి సంబంధించి బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ప్రతి అంశంపై గణాంకాలతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరును ఉధృతం చేయనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు.
విమర్శకు ప్రతివిమర్శ
ప్రభుత్వంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే విమర్శల దాడి
అదేస్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్న
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి
ఇద్దరూ బాల్కొండ నియోజకవర్గం వారే
కావడంతో ఆసక్తికరంగా రాజకీయం
Comments
Please login to add a commentAdd a comment