‘కుమారుడి మృతిపై విచారణ జరిపించాలి’
బోధన్‌టౌన్(బోధన్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గూడాల శివ జస్విత్‌రెడ్డి(14) మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, సరైన విచారణ జరిపించి న్యాయం చేయాలని విద్యార్థి తండ్రి, బంధువులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును కోరారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో ఎమ్మెల్యేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. మీ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని గత నెల 28న ఉదయం 9:30 గంటలకు పాఠశాల నుంచి ఫోన్ వచ్చిందని.. నేను పాఠశాలకు వెళ్లేసరికి నలుగురు తోటి విద్యార్థులు జస్విత్ రెడ్డిని మోసకొస్తున్నారని.. ఎలాంటి కదలికలు లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రతిభా ఆస్పత్రిలో చేర్పించామన్నారు. వారు చెక్ చేసి ప్రాణం లేదని చెప్పారని విద్యార్థి తండ్రి భాస్కర్ రెడ్డి వాపోయారు. కాకతీయ యాజమాన్యం మాకు శవాన్ని అప్పగించిందని..ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, సరైన విచారణ జరిపి న్యాయం చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పిట్లం: మండలంలోని తిమ్మనగర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవాం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలంలోని మార్ధండ గ్రామానికి చెందిన వడగామ మల్లయ్య(30) పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మంగళవారం విధులు నిర్వహించుకొని బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా తిమ్మనగర్ శివారులో గుర్తు తెలియని వాహణం ఢీకొనడంతో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment