క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్
నిజామాబాద్ నాగారం: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన్న మంగళవారం పేర్కొన్నారు. తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు www.cmcup2024. telangana. gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పంచాయతీ స్థాయిలో..
ఈ నెల 7, 8 తేదీల్లో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారిని మండల స్థాయికి పంపిస్తారు. పంచాయతీ కమిటీలో జీపీ కార్యదర్శి చైర్మన్‌గా, పాఠశాల హెడ్‌మాస్టర్ కన్వీనర్‌గా, పీఈటీ, పీడీ సీనియర్ క్రీడాకారులు, వీఏలు సభ్యులుగా ఉంటారు.
మండల స్థాయిలో..
ఈ నెల 10 నుంచి 12 వరకు మండల, మున్సిపాలిటీ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. మండల సెలక్షన్ కమిటీలో స్పెషల్ ఆఫీసర్ చైర్మన్‌గా, ఎంపీడీవో కన్వీనర్, తహసీల్దార్, ఎంఈవో, ఎస్సై, ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్/మేయర్ చైర్మన్‌గా, కమిషనర్‌లు కన్వీనర్‌గా, తహసీల్దార్, ఎంఈవో, ఎస్సై, ఎజీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, సీనీయర్ క్రీడాకారులు సభ్యులుగా ఉంటారు.
జిల్లాస్థాయిలో..
మండల, మున్సిపల్ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 16 నుంచి 21 వరకు జిల్లాస్థాయి పోటీలు ఉంటాయి. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, కుస్తీ, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, చెస్, బేస్‌బాల్, నెట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, ఉషూ, జూడో, కిక్ బాక్సింగ్ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్స్, మెడల్స్ అందిస్తారు. వారిని రాష్ట్రస్థాయికి పోటీలకు పంపుతారు.
రాష్ట్రస్థాయిలో..
రాష్ట్రస్థాయి పోటీలో గెలిచిన విజేతలకు రూ.లక్ష, ద్వితీయస్థానంలో ఉన్న జట్టుకు రూ.75వేలు, మూడో స్థానంలో ఉన్న జట్టుకు రూ. 50వేలు నగదు బహుమతి అందజేస్తారు. అలాగే వ్యక్తిగత క్రీడాంశంలో విజేతకు రూ.20వేలు, రన్నర్‌కు రూ.15వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10వేలు నగదు ఇస్తారు.
7 నుంచి టోర్నీ ప్రారంభం
గ్రామస్థాయి నుంచి పోటీలు
రాష్ట్ర స్థాయి విజేతకు
రూ.లక్ష బహుమతి
Comments
Please login to add a commentAdd a comment