అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
నిజామాబాద్ రూరల్: అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని ముదక్‌పల్లి శివారులోని పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 7నాటికి ప్రభుత్వం చేపట్టి ఏడాది పూర్తవుతున్నందున రాష్ట్రంలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిధులు, నీళ్లు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గత పాలకుల చేతిలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు సిలిండర్, రైతులకు మద్దతు ధరతో పాటు వరికి క్వింటాలుకు అదనపు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు లేవని ఎమ్మెల్యే భూపతిరెడ్డి బీజేపీ పార్టీపై దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ నాయకులు గుజరాతీలకు గులామ్‌గిరి చేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఆరువేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలు, 12వేల మంది టీచర్లకు ప్రమోషన్లతో కూడిన పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఓడిసిన ముచ్చటేనని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బాడ్సి శేఖర్‌గౌడ్, నాయకులు బాగిర్తి బాగారెడ్డి, అగ్గు బోజన్న, సాయారెడ్డి, గంగారెడ్డి, మోహన్‌రెడ్డి, దాసరి శ్రీధర్, రాజాకిషన్, కె శ్రీనివాస్, పి శ్రీనివాస్, భూమయ్య, కరాటే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
మహిళలను లక్షాధికారులను
చేయడమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment