మలేషియా సమావేశానికి ప్లీనరీ స్పీకర్‌గా క్షత్రియ హెచ్‌వో
పెర్కిట్: మలేషియా దేశం కౌలాలంపూర్‌లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే గ్లోబల్ కాంగ్రెస్ ఆన్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ సమావేశానికి ప్లీనరీ స్పీకర్‌గా ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల ఎంబీఏ హెచ్‌వోడీ మాడవేడి సుధాకర్ ప్రసంగించనున్నారు. మలేసియాలో ఐన్‌స్టీన్ రీసర్చ్ అకాడమీ, ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మలేషియా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న సమావేశంలో సుధాకర్ ప్లీనరి స్పీకర్‌గా ప్రసంగిచనున్నట్లు కళాశాల యాజమాన్యం మంగళవారం వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి నిర్ధేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ స్టడీస్ మొదలైన విభాగాలు పోషించాల్సిన పాత్రపై సుధాకర్ ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్‌కు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment