ప్రముఖ హోమియో వైద్యుడు శివప్ప మృతి
బోధన్: బోధన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ హోమియో వైద్యుడు శివప్ప(61) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన శివప్ప కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు దత్తత వచ్చాడు. అనంతరం బోధన్‌లో క్లినిక్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఆయన బీజేపీ నాయకుడిగా పని చేశారు. 1990లో బీజేపీ అనుబంధ యువ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1992–96 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2000–2004 వరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009లో బీజేపీ నుంచి బోధన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఏడాది కాలం నుంచి హైదరాబాద్‌లోని తన కూతురు వద్ద ఉంటున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ 8న ఆయన కుమారుడు విశ్వనాథ్(32) ఆరోగ్య సమస్యలతో మృతి చెందాడు. రెండు నెలల్లో తండ్రీకొడుకులు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment