పంటలపై చలి ప్రభావం
● మారిన వాతావరణం
● అధిక చలితో తెగుళ్లబారిన పంటలు
● ఎదుగుదల లోపించిన నారుమడులు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులకు ఆదిలోనే సవాళ్లు ఎదురవుతున్నా యి. ప్రతికూల వాతావరణంతో పంటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. అధిక చలి కారణంగా పోసిన నారుమడులు సక్రమంగా ఎదగడం లేదు. తెగుళ్లతో రంగుమారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మందుల కోసం పురుగుల మందు దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కువ డబ్బు లు వెచ్చించి మందులు కొనుగోలు చేసి నారుమడులకు చల్లుతున్నారు. జిల్లాలో 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేసేందుకు నారుమ డులను సిద్ధం చేస్తున్న తరుణంలో తెగుళ్లు ఆశిస్తున్నాయి. చలి ప్రభావం తగ్గే వరకు వేచి చూద్దామనే ఆలోచనలో కొంతమంది రైతులున్నారు. ఇటు మొక్క దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న పంటలను సైతం తెగుళ్లు ఆశిస్తున్నాయి. అయితే నారుమడిని రక్షించుకోవడానికి పగటి పూట వెచ్చటి నీటిని అందించాలని, మంచు పడకుండా తాటిపత్రులు కప్పి ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సే న్ రైతులకు సూచిస్తున్నారు. అలాగే నారు ఆరోగ్యంగా పెరిగేందుకు యూరియాకు 2గ్రాముల కార్బండిజమ్‌తోపాటు మాంకోజెడ్ మిశ్రమాన్ని కలిపి చిరికారీ చేయాలన్నారు. ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడితే జింకు సల్పేట్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, కాండం తొలుచు పురుగు నుంచి కాపాడుకోవడానికి కార్బోప్యూరాన్ 3జీ గులికలు ఎకరానికి సరిపడే నారుమడికి కిలో చొప్పున చల్లాలని సూచించారు.
తుపాను ప్రభావం... కల్లాల్లో వడ్లు
జిల్లాలో డొంకేశ్వర్‌తోపాటు పలు మండలాల్లో వరికోతలు ఇంకా అక్కడడక్కడా పూర్తికాలేదు. ఇటు కోసిన పంట కూడా కొంత మేర కల్లాల్లోనే ఉంది. అల్పపీడనం కారణంగా జిల్లాలో సైతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు మండలాల్లో చిరు జల్లులు సైతం కురిశాయి. దీంతో కల్లాల్లో ధాన్యం ఉంచిన రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షం ముప్పు ఉండడంతో ధాన్యం కుప్పలు, సంచులపై టార్పాలిన్లు కప్పి ఉంచారు.
దత్తాపూర్ శివారులో ఎదుగుదల లేని నారుమడి
Comments
Please login to add a commentAdd a comment