లైబ్రరీలో సౌకర్యాల పరిశీలన
వేల్పూర్: మండల కేంద్రంలోని లైబ్రరీని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆదివారం సందర్శించారు. లైబ్రరీలో సౌకర్యాలను పరిశీలించిన ఆయన నిరుద్యోగులు, విద్యార్థులతోపాటు అన్ని వ ర్గాలవారు చదువుకోడానికి అవసరమైన పు స్తకాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని తెలుసుకున్నారు. అంతిరెడ్డి వేల్పూర్‌కు మొదటిసారి రావడంతో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు సన్మానించా రు. మండల కాంగ్రెస్ అధ్యక్షు డు గడ్డం న ర్సారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లే శ్, నా యకులు గౌరాయి నరేందర్, రమణ, రాజేందర్, మల్లయ్య, మోహన్, రాజేశ్వర్, వినోద్, ప్రవీన్, చిన్నయ్య, రహీం పాల్గొన్నారు.
హిందువులు సంఘటితంగా ముందుకెళ్లాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హిందువులు మరింత సంఘటితంగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత పెరుగుతోందని విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి ధాత్రిక రమేశ్ పేర్కొన్నారు. ఆర్మూర్ రోడ్డులోని కంఠేశ్వర్ ఇస్కాన్ మందిరంలో అధ్యక్షుడు రామానందరాయ్ గౌరదాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆరాధన, భజనలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధాత్రిక రమేశ్.. మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనలను చూసి ప్రతి భారతీయుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. బంగ్లాదేశ్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఇస్కాన్ సంస్థ బాధ్యులపై అక్కడి ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోందన్నారు. బంగ్లా హిందువులపై విచ్చలవిడిగా దాడులు చోటుచేసుకుంటున్నాయన్నారు. సనాతన ధర్మంపై అంతర్జాతీయ కుట్రలు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో భారత్‌లో హిందువులు మరింత ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు నరేశ్, బలరాందాస్ తదితరులు పాల్గొన్నారు.
పోతంగల్
చెక్‌పోస్ట్ తనిఖీ
రుద్రూర్: పోతంగల్ శివారులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఆదివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది అ ప్రమత్తంగా ఉండాలని, సూచించారు. ఇసుక అక్రమ రవాణకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దన్నారు. పకడ్బందీగా వి ధులు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు హంగర్గా గ్రామ శివారులోని మంజీరా వద్ద ఉన్న ఇసుక క్వారీని పరిశీలించారు. ఇసుక తరలింపులో నిబంధనలు పాటిస్తున్నారా.. ఎంత మేరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారనిగమనించారు. తహ సీల్దార్ మల్లయ్య, మండల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment