అసంపూర్తిగానే రైతు రుణమాఫీ
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అసంపూర్తిగా చేసిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రూ.40వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అమలు చేసే పరిస్థితి వచ్చేసరికి 24 లక్షల మంది రైతులకు కేవలం రూ.20వేల కోట్ల రూపాయలను మాత్రమే మాఫీ చేసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 3,79,520 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా నాలుగు విడతల్లో 2,01,967 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,77,553 వేల మంది రైతులకు రుణమాఫీ అవ్వా ల్సి ఉందన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన రుణమాఫీతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చాలా తక్కువ అని అన్నారు. కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఎక్కువే రుణమాఫీ చేశారన్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయించారని, దీంతో చాలా మంది రైతులు బోనస్ అందుకోలేకపోయారన్నారు. అమ్ముకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఆలస్యంగా కొనుగోలు చేయడం వల్ల బోనస్ తప్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్ ట న్నుల దిగుబడి వస్తే ప్రభుత్వం ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. జిల్లా రైతులకు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.90 కోట్లు మాత్రమే చెల్లించారని విమర్శించారు. ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించిన రైతులకు సైతం ఎకరానికి 24 క్వింటాళ్ల చొ ప్పున దిగుబడిని లెక్కగట్టి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. రైతుబంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే ప్రజలు తిరగబడతారని అన్నారు. రైతులను నిండాముంచి రైతుపండుగ చేసుకోవడం బాగోలేదన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment