ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో ఆదివారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మూడో రాష్ట్ర వి ద్యా మహాసభలు ప్రారంభమయ్యాయి. షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం తనను సలహాదారుగా నియమించిందన్నారు. అంబేడ్కర్, పూలే ఆశయాలను కొనసాగించడానికి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కు నాణ్యమైన విధ్యను అందించి భవిష్యత్ తరా లకు బంగారు బాటలు వేయాలని కోరారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా తొమ్మిదేళ్లు కాలయాపన చేసిందని విస్మరించారు. తమ ప్రభు త్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నారు. రాష్ట్రంలో 90 శా తం కులగణన సర్వే పూర్తయ్యిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ఆ సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. మహాసభల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్, రాష్ట్ర కోశాధికారి సంగయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 90 శాతం కుల గణన
సర్వే పూర్తి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment