నిజామాబాద్ నాగారం: వైద్యారోగ్య శాఖలో డిప్యు టేషన్లు రద్దు చేసినా ఓ అధికారి మాత్రం ఇప్పటికీ తన సొంతశాఖకు రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. వైద్యారోగ్యశాఖ ఉద్యోగి సోలోమాన్ డిప్యుటేషన్‌పై వెళ్లి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వాహనాల ఇన్‌చార్జి, డాగ్ స్క్వాడ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. డిప్యుటేషన్లు రద్దయిన నేపథ్యంలో వెనక్కి వచ్చేయాలని డీఎంహెచ్‌వో చెప్పి నా ఆయన పెడచెవిన పెట్టడం గమనార్హం. తనకు వేతనం రాకున్నా ఇక్కడే పని చేస్తానని తోటి ఉద్యో గులతో ఆయన పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒక్కనెల వేతనం ఆలస్యమైతేనే తాము ఇబ్బందులు పడతామని, ఈయన మాత్రం ఐదు నెలలుగా వేతనం రాకున్నా ఇక్కడే కొనసాగుతున్నాడని చర్చించుకుంటున్నారు.
ఐదేళ్లుగా కార్పొరేషన్‌లోనే..
డీఎంహెచ్‌వో నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సోలోమాన్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు ఐదేళ్లుగా శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌గా, డంపింగ్‌యార్డు ఇన్‌చార్జీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ డిప్యుటేషన్లను ఫిబ్రవరిలో రద్దు చేయగా, అందరూ సొంతశాఖకు వెళ్లిపోయారు.
అయితే సోలోమాన్‌తోపాటు నటరాజ్‌గౌడ్ అనే ఉద్యోగి వెనక్కి వెళ్లలేదు. వైద్యారోగ్య శాఖాధికారులు వేతనాలను నిలిపి మున్సిపల్ కార్యాలయానికి నోటీసు పంపించడంతో గత నెల 22న నటరాజ్‌గౌడ్ సొంతశాఖకు వెళ్లిపోయారు. డిప్యుటేషన్ రద్దయినప్పటికీ ఉద్యోగి వెనక్కి రాకపోవడంతో నోటీసులు ఇచ్చామని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ స్పష్టం చేశారు.
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దైనా మున్సిపాలిటీని వీడని ఉద్యోగి
సొంత శాఖకు వెళ్లేందుకు విముఖత
నోటీసు పంపిన డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment