నాలుగో విడతా నిరాశే! | - | Sakshi
Sakshi News home page

నాలుగో విడతా నిరాశే!

Published Tue, Dec 3 2024 1:38 AM | Last Updated on Tue, Dec 3 2024 1:37 AM

నాలుగ

నాలుగో విడతా నిరాశే!

అర్హత ఉన్నా అందని రుణమాఫీ

రూ. రెండు లక్షల లోపు ఉన్నా

మాఫీ కానీ వైనం

ఆందోళన చెందుతున్న రైతులు

మోర్తాడ్‌(బాల్కొండ)/ఇందల్వాయి: వివిధ కారణాలతో రూ.2 లక్షల లోపు రుణం మాఫీ కాని వారికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి మాఫీ సొమ్మును మహబూబ్‌నగర్‌ వేదికగా విడుదల చేశారు. అ యితే అనేక మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ జ మకాకపోవడంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలో గతంలో మూడు విడతల్లో 83,061 మంది రైతులకు రూ.626.49 కోట్లను విడుదల చేయగా నాలుగో విడతలో రూ.155.81 కోట్లను 17,551 మంది రైతులకు మంజూరు చేశారు. రుణమాఫీ ఫలాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 2లక్షల మందికి పైగానే ఉంటుందని అంచనా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోను అనేక మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో

39,285 మంది రైతులు రుణమాఫీ కోసం దర ఖాస్తులు అందించారు. ఇదిలా ఉండగా దర ఖాస్తుల్లో ఒకే కుటుంబం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయని, అలాంటి వారిని కలిపితే రెండు లక్షలకు మించి రుణం ఉన్న కేటగిరిలోకి వారు వెళ్లడంతో దరఖాస్తుల సంఖ్యకి లబ్ధిదారుల సంఖ్యకి తేడా ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

ప్రభుత్వం మాట తప్పింది

రుణమాఫీ విషయంలో ప్ర భుత్వం మాట తప్పింది. గతంలో ఏక కాలంలోనే రూ.2 లక్షల వరకు పంట రుణం మాఫీ అని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు సంమంజసం. ప్రభుత్వం రైతులను వంచించడం సరికాదు. వెంటనే రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి.

– ఏనుగు రాజేశ్వర్‌, రైతు, మోర్తాడ్‌

రూ.లక్ష రుణం

నేను దుబాయిలో ఉంటాను. పాస్‌బుక్‌ నా పేరు మీద, పంటరుణం నా భార్య పేరు మీద ఉండేది. కటాఫ్‌ తేదీ తర్వాతనే పంట రుణం చెల్లించాను. అర్హులమైన మాకు పంట రుణం అందలేదు. ఇకనైనా మాకు న్యాయం చేయాలి.

– పత్తిపాకల రాజేందర్‌, నల్లవెల్లి

మోర్తాడ్‌ మండలం సుంకెట్‌కు చెందిన రైతు ఆరెపల్లి గంగాప్రసాద్‌కు ఎస్‌బీఐలో రూ.50 వేల పంట రుణం ఉంది. గతంలో రెండు అకౌంట్‌లు ఒకే పేరు మీద ఉన్నాయనే కారణంతో రుణమాఫీ సొమ్ము సదరు రైతు గంగాప్రసాద్‌ ఖాతాలో జమ కాలేదు. నాలుగో విడతలో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ఆశించిన గంగాప్రసాద్‌కు నిరాశే మిగిలింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన సాయిరాంకు వేల్పూర్‌ మండలం రామన్నపేట్‌ దక్కన్‌ గ్రామీణ బ్యాంకులో రూ.2.45 లక్షల పంట రుణం ఉంది. అతనికి రూ.2 లక్షల రుణమాఫీ సొమ్ము జమ కావాల్సి ఉండగా ఎక్కువ రుణం ఉన్నందున మాఫీ సొమ్ము పొందడానికి అర్హత లభించలేదు. ఇలా గంగాప్రసాద్‌, సాయిరాంల మాదిరిగానే ఎంతో మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నాలుగో విడతా నిరాశే!1
1/2

నాలుగో విడతా నిరాశే!

నాలుగో విడతా నిరాశే!2
2/2

నాలుగో విడతా నిరాశే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement