అట్టహాసంగా ఆరోగ్య ఉత్సవాలు
నిజామాబాద్‌నాగారం: ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘ ఆరోగ్య ఉత్సవా లు’ కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఆ యా జిల్లాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను, మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లను హైదరాబాద్ నుంచి మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్య ఉత్సవాల కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధా న్యత ఇస్తోందన్నారు. అధికారం చేపట్టిన 48 గంటల వ్యవధిలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఉచిత బస్సు ప్ర యాణం, రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామ న్నారు.రూ. 2 లక్షల లోపు పంట రుణా లను మాఫీ చేశామని, సంక్రాంతి తరువాత రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిల్లాకు కొత్తగా మరో ఎనిమిది 108 అంబులెన్సులు, అదే విధంగా 102 వాహనాలు రానున్నాయన్నారు. కా ర్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటె డ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్‌లు డాక్టర్ నాగమోహన్, డాక్ట ర్ జలగం తిరుపతిరావు, నాయ కులు నగేష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాకు కొత్తగా మరో ఎనిమిది 108
అంబులెన్సులు
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment