గ్రూప్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్ అర్బన్: ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్–2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓఎంఆర్ ప్యాకింగ్ సంబంధిత వివరాలను వివరించారు.
చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ముందస్తుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్ష సెంటర్ల గుర్తింపులో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. సమావేశంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ బి సత్యనారాయణ, వివిధ పరీక్ష కేంద్రాల ఆర్డినేటర్లు, రీజినల్ కోఆర్డినేటర్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment