ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సహాయ కలెక్టర్ (యూటీ) సంకేత్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డికి విన్నవిస్తూ అర్జీలను అందజేశారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఉద్యోగాలు ఇప్పించండి
61 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులకు జీవో నంబర్ 81 ప్రకారం ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని, వెంటనే అమలు చేయాలన్నారు.
విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి
నగరంలోని కాకతీయ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి శివజశ్విత్‌రెడ్డి మృతిపై విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి
అధికారులకు కలెక్టర్
రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశం
80 ఫిర్యాదులు నమోదు
Comments
Please login to add a commentAdd a comment