నవీపేట: భార్య కాపురానికి రావడం లేదని మండలంలోని కోస్లీ గ్రామానికి చెందిన మిణుగురు శివ(28) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. ఎత్తొండ గ్రామానికి చెందిన లావణ్యతో ఆరేళ్ల కిందట శివకు వివాహం కాగా, కుటుంబ కలహాల కారణంగా గత ఏడు నెలల క్రితం లావణ్య పుట్టింటికి వెళ్లిందన్నారు. ఆమె తిరిగిరాకపోవడంతో మనస్తాపానికి గురైన శివ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మద్యానికి బానిసై..
నిజామాబాద్ రూరల్: మద్యానికి బానిసై రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూపన్‌పల్లికి చెందిన గంగాధర్(32) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. ఇటీవల గంగాధర్ తీవ్రంగా మద్యం సేవించడంతో తల్లిదండ్రులు గంగాధర్‌ను మందలించారు. దీంతో గంగాధర్ గడ్డిమందు సేవించగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు తన తల్లిదండ్రులతోపాటు భార్యను పొలానికి పంపించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment