స్కీంలో సభ్యులను చేర్పించిన వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. సభ్యులను చేర్పిస్తే ప్రతి నెలా కమీషన్ ఇస్తామని నిర్వాహకులు నమ్మించడంతో చాలా మంది సభ్యులను చేర్పించడంతోపాటు వారే సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశారు. స్కీం బాధితులు ఇప్పుడు తమను సభ్యులుగా చేర్పించిన వారిని పట్టుకున్నారు. దొన్కల్‌కు చెందిన బాధితులు ఇటీవల భీమ్‌గల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేశ్‌కుమార్‌ను ఆశ్రయించగా.. ఆయన ఏజెంట్లుగా వ్యవహరించిన వారిని పిలిపించి స్కీం డబ్బులు వాపసు చేయాలని ఆదేశించారు. రోజువారి విధుల్లో బిజీగా మారడంతో మళ్లీ పోలీసులు దీనిపై దృష్టి సారించలేదు. కమ్మర్‌పల్లి కేంద్రంలో ఓ స్కీం నిర్వాహకులు ఇదే విధంగా ప్రజలను మోసం చేయడంతో బాధితులు తమను సభ్యులు చేర్పించిన వ్యక్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై అనిల్‌రెడ్డి చొరవ తీసుకుని కొంత నగదు, కొన్ని టీవీలు, ఫ్రిజ్‌లు ఇప్పించారు. మరి కొంత నగదు, మరికొన్ని వస్తువులు ఇవ్వడానికి స్కీం నిర్వాహకులు గడువు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment