హైవేపై కారు దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి సమీపంలోని ఎన్‌హెచ్ 161 సర్వీస్ రోడ్డుపై సోమవారం ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందని స్థానికులు, ఫైర్ సిబ్బంది తెలిపారు. డోంగ్లీ మండలంలోని మారేపల్లికి చెందిన నలుగురు కారులో సిర్‌పూర్‌కు వెళ్తుండగా, మద్నూర్ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తమై కారు నిలిపివేసి అందులోని వారిని కిందికి దింపేయడంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కారులో ప్రయాణిస్తున్న వారు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ బంధువులు అని తెలిసింది.
ఫాగింగ్‌మిషన్‌కు మంటలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని ఆరో వార్డు అన్నపూర్ణ కాలనీలో సోమవారం సాయంత్రం మున్సిపాలిటీకి చెందిన ఆటోలో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఫాగింగ్ యంత్రానికి మంటలు అంటుకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై జనావాసాలకు దూరంగా ఆటోను తీసుకెళ్లి వదిలిపెట్టాడు. అనంతరం మంటలను సిబ్బంది ఆర్పివేశారు.
Comments
Please login to add a commentAdd a comment