ప్రమాదవశాత్తు లారీ బోల్తా
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలోని గోపాల్‌పేట నుంచి బంజరకు వెళ్లే రోడ్డులో నిర్మాణదశలో ఉన్న కల్వర్టు వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది. గుంటూరు నుంచి పత్తిలోడ్‌తో మహారాష్ట్రలోని దులియాకు వెళ్తున్న లారీ (ఏపీ 16 టీజే 5839) ప్రమాదవశాత్తు బోల్తాపడగా, లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. నూతన వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతంలో సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో లారీ బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డువిస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాలలో సరైన సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రాయన్‌పల్లి శివారులో కారు..
ఇందల్వాయి: చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులోని 44వ నంబరు జాతీయ రహదారి పైనుంచి ఓ కారు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment