స్కీం పేరుతో స్కాం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్‌కు చెందిన దేవమ్మ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తన ఇద్దరు మనవళ్లకు ఎంతో కొంత జమ చేయాలనే ఉద్ధేశంతో ఒక స్కీంలో సభ్యురాలిగా చేరి నెలకు రూ.599 చొప్పున 15 నెలల పాటు రూ.8,985 జమ చేసింది. ఇద్దరు మనవళ్ల పేరు మీద ఆమె మొత్తం రూ.17,970 స్కీం నిర్వాహకులకు చెల్లించింది. స్కీం కాల పరిమితి ముగిసినా నిర్వాహకులు దేవమ్మకు బహుమతిని కానీ ఆమె జమ చేసిన డబ్బును కానీ వాస్ చేయడం లేదు.
ఇదే గ్రామానికి చెందిన స్వరూప స్కీంలో సభ్యురాలిగా చేరి రూ.8,985 జమ చేసింది. ఆమెకు ఎలాంటి బహుమతిని ఇవ్వలేదు. ఇలా దేవమ్మ, స్వరూపకే కాదు వేలాది మందికి స్కీం నిర్వాహకులు ముఖం చాటేశారు. నిజామాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కీంతో అనేక మంది మోసపోయారు. స్కీం కాల పరిమితి ముగిసి రెండేళ్లు గడిచినా సభ్యులకు బహుమతులు ఇవ్వకుండా, వారి డబ్బులు వాపసు చేయకుండా నిర్వాహకులు సతాయిస్తూనే ఉన్నారు.
4వేల మందికి పైగా రూ.4 కోట్ల వరకు నిర్వాహకులకు చెల్లించారు. నామమాత్రంగానే బహుమతులను ఇచ్చి పెద్ద మొత్తంలో నగదును స్కీం నిర్వాహకులు నొక్కివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కీం నిర్వాహకులలో ఒకరు పోలీసు ఉద్యోగి కొడుకు కావడంతో అతనిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బాధితులు జంకుతున్నారని తెలుస్తోంది. గతంలోనూ దొన్కల్ కేంద్రంగా కొందరు రాజకీయ నాయకులు స్కీంను నిర్వహించి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. ముందస్తు ఎన్నికలకు ముందు తమ పార్టీకి ఎక్కడ ముప్పు వస్తుందో అనే భయంతో కీలకమైన నాయకులు చొరవ తీసుకోవడంతో స్కీం సభ్యులకు సగంసగం డబ్బులను నిర్వాహకులు వాపస్ చేశారు.
సామాన్యులకు రూ.4కోట్ల
వరకు టోకరా
ముఖం చాటేసిన స్కీం నిర్వాహకులు
రెండేళ్లు గడిచినా బహుమతులు లేవు..
డబ్బులు వాపస్ ఇవ్వడం లేదు
పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment