సాధారణ ప్రసవాలను పెంచాలి
రెంజల్(బోధన్): ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను పెంచాలని ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ జిల్లా పోగ్రాం అధికారి రాజాగౌడ్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆయన ఆస్పత్రిలో ప్రసవాలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మందుల గదిని పరిశీలించారు. అంతకు ముందు తాడ్‌బిలోలి సబ్‌సెంటర్‌ను సందర్శించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారిణి విశాలరాణి, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ రాము, ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రావణ్‌కుమార్, రవీందర్‌తోపాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా బాలికల
జట్టు శిక్షణ శిబిరం
డిచ్‌పల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(సుద్దపల్లి) క్రీడామైదానంలో స్కూల్ గేమ్స్ అండర్ –17 ఉమ్మడి జిల్లా బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని ప్రిన్సిపల్ తీగుళ్ల నళిని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఆర్మూర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర) ఆర్మూర్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేశ్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, వ్యాయామ ఉపాధ్యాయులు జోత్స్న, శ్రీలత, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్‌లు మౌనిక, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment