నిజామాబాద్‌నాగారం: ఇరిగేషన్ సూపరింటెండెట్‌పై ముఖ్యమంత్రి కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. విషయం ఆలస్యంగా వెలుగుచూసినా విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు బాధితులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
నిజామాబాద్ ఈఎన్‌సీ పరిధిలో ఆర్మూర్, నిజామాబాద్ ఎస్‌ఈ కార్యాలయాలున్నాయి. అయితే ఆర్మూర్ ఎస్‌ఈ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎస్‌ఈ తనను అకారణంగా వేధించడంతోపాటు విధుల్లో నుంచి తొలగించాడని, ఉన్నతాధికారులతోపాటు సీఎం కార్యాలయంలో మే నెలలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో నిజామాబాద్ ఈఎన్‌సీని డివిజన్ ఎస్‌ఈకి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి విచారణ మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోందని, ప్రతి నెలా వేతనంలో నుంచి రూ.4వేల చొప్పున ఇవ్వాలని ఎస్‌ఈ తనను మానసికంగా వేధించాడని బాధితుడు వాపోయాడు. ఈ విషయమై ఇరిగేషన్ ఈఎన్‌సీ మధుసూదన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. శాఖలో జరిగే విచారణ విషయాలను మీకెందుకు చెప్పాలి. ఎప్పుడు ఫిర్యాదు చేశారని, విచారణ పూర్తయ్యిందని ఓసారి, కాలేదని మరోసారి దాటవేసే ప్రయత్నం చేశారు.
ఉద్యోగులు కక్షగట్టి ఫిర్యాదు చేయించారు
మా డివిజన్‌లోని ఉద్యోగులు కావాలనే కక్షగట్టి నాపై ఫిర్యాదు చేయించారు. డ్రైవర్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు. కఠినంగా ఉంటాను కాబట్టే డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించారు.
– యశస్విని, ఆర్మూర్ డివిజన్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment