అసంపూర్తి కట్టడాలకు మోక్షం
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో ఏళ్ల తరబడిగా అసంపూర్తిగా ఉన్న కట్టడాలకు కాంగ్రెస్ హయాంలో మోక్షం లభిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పనులకు శంకుస్థానలు చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రూరల్ మండలంలోని ఖానాపూర్ డివిజన్, కేశాపూర్, జాలాల్‌పూర్, తిర్మన్‌పల్లి గ్రామాల్లో సుమారు రూ. 15 కోట్లతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పాఠశాల ప్రహరీ, డ్రయినేజీలు, సీసీ రోడ్డు, బీటీ రోడ్లు, లిఫ్టి ఇరిగేషన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న గ్రామస్తుల కల నెరవెరుతోంది. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, స్థానిక ప్రజాప్రతినిధులు ధనార్జనే ధ్యేయంగా పని చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రూరల్ మండలానికి గత ప్రభుత్వ హయాంలో ఆశించదగ్గ నిధులు రాలేవని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
సమస్యలు పరిష్కారం..
కాంగెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూరల్ మండల ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని దీమా వ్యక్తం చేస్తున్నారు. రూరల్ మండలంలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అభివృద్ధి పథంలో నిజామాబాద్ రూరల్
పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
ఖానాపూర్ డివిజన్‌లో ఎన్నో ఏ ళ్లుగా రోడ్డు కంకర తేలింది. దీంతో వాహనదారులు,స్థానికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత ప్రభుత్వానికి సమస్యను తీసుకెళ్లినా స్పందించలేదు. ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చొరవతో డివిజన్‌లో నూతన రోడ్లు, డ్రయినేజీలు ఏర్పడ్డాయి. సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యేకు అండగా ఉంటాం.
– కొర్వ రాజేంద్ర ప్రసాద్, ఖానాపూర్
Comments
Please login to add a commentAdd a comment