బీజేపీకి దళితులను దూరం చేసే కుట్ర
సుభాష్‌నగర్: దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ బీజేపీకి దళిత సమాజాన్ని దూరం చేసే కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బీఆర్ శివప్రసాద్ విమర్శించారు. సోమవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఆయన అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా బొంబాయిలో చేసి అవమానించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని దుష్ఫ్రచారం చేశారని, కానీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏనాడూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని కాపాడుతోందని అన్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో దళితులంతా బీజేపీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించారని, దీన్ని ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలను కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆరోపించారు. అంబేడ్కర్, భారత రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం కాదని, దళిత సమాజం మరోసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు కుమార్, సందీప్, కెప్టెన్ రాజు, ముత్యా లు, సంజీవ్, బాలకృష్ణ, పవార్ పాల్గొన్నారు.
బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు
బీఆర్ శివప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment