ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
మోపాల్: దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని, వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సోమవారం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 20వ వర్ధంతి సందర్భంగా నగరశివారులోని బోర్గాం(పి) చౌరస్తాలో పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశం ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి గట్టెక్కించారని గుర్తుచేశారు. ప్రధానిగా పీవీ సేవలు అమోఘమని కొనియాడారు. ఆయన వెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు అమృతాపూర్ గంగాధర్, సుభాష్, రఘు, శివ లింగం, రాజశేఖర్‌రెడ్డి, విఠల్, సాంసన్ తదితరులు ఉన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోర్గాం(పి) చౌరస్తాలోని ఆయన విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన వెంట నాయకులు కిరణ్ కుమార్ దేశ్‌పాండే, లక్ష్మీనారాయణ భరద్వాజ్, నాగేశ్వర్‌రావు, తెలంగాణ శంకర్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ కార్యాలయంలో..
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment