పాఠశాలల్లో గణిత దినోత్సవం
మోపాల్: మండలంలోని కంజర్, నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సోమవారం గణిత దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోర్గాం(పి)లో విద్యార్థులు తాము తయారు చేసిన మోడల్స్, చార్ట్స్, ఫార్ములాలను ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు శ్రీకాంత్, స్వప్న, కిషన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్, కల్పన, దీప తదితరులు పాల్గొన్నారు.
కంజర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో..
కంజర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హెచ్‌ఎం గోపాలచారి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గణిత ఉపాధ్యాయుడు రాఘవా పురం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పిల్లలకు గణిత ప్రదర్శనలు, క్విజ్, ముగ్గుల పోటీలు, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతు లు అందజేశారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటంతోపాటు గణిత రంగోళి, ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, ఉమ, గౌరీ, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో..
ధర్పల్లి: మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు గణిత నమూనాలను తయారుచేసి ప్రదర్శన చేశారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా గణిత సంబంధిత అంశాలను పాఠశాల సిబ్బంది వర్క్ షాప్ నిర్వహించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు గణిత అక్షరమాల ఆకారంలో కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్, హెచ్‌ఎం సాధన, ప్రశాంత్ గౌడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment