అక్రమ నిర్మాణాలు తొలగించాలి
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బోధన్ బస్టాండ్ సమీపంలోని అహ్మద్‌బజార్‌లో నిర్మించి వృథాగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలన్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ఈనెలతో ముగియనుండటంతో వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్‌తోపాటు డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, అడిషనల్ కమిషనర్ ఎన్ శంకర్, మున్సిపల్ చీఫ్ ఇంజినీర్ మురళీమోహన్‌రెడ్డిలు ఉన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను
వినియోగంలోకి తేవాలి
కౌన్సిల్ సమావేశానికి
ఏర్పాట్లు చేయాలి
మున్సిపల్ అధికారులతో
ఎమ్మెల్యే ధన్‌పాల్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment