విద్యార్థులకు అభినందన
నిజామాబాద్ రూరల్: ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కవితా, రచనల పోటీల్లో విద్యార్థులు జిల్లాస్థాయిలో బహుమతులు గెలుచుకోవడం అభినందనీయమని గుండారం జెడ్పీ ఇన్‌చార్జి హెచ్‌ఎం గిరిధర్ అన్నారు. సోమవారం ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షుడు కాసర్ల నరేశ్‌రావు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తెలుగు ఉపాధ్యాయులు దస్తగిరి, నరేంద్రమూర్తిలను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆరోగ్యరాజ్, నవీనకుమారి, శుభదేశ్ పాండె, ప్రణీత, పుష్పలత, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారాభివృద్ధికి
రుణాలు అందిస్తాం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మహిళా సంఘాల సభ్యులకు వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణాలు అందజేస్తామని బ్యాంకుల మేనేజర్లు పేర్కొన్నారు. మండలకేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం ఇండియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ సుధాకర్, కరీంనగర్ జోనల్ ఆఫీస్ మేనేజర్ సంతోష్‌కుమార్, నిజామాబాద్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ రామానంద్, మేనేజర్ పవార్ ఏపీఎం మోహన్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మహిళా సంఘాలకు ఇండియన్ బ్యాంకు ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను 753.74లక్షలకు గాను ఇప్పటివరకు 697.39 లక్షలు ప్రగతి సాధించారని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. మార్చి 31లోపు మిగిలిన 56.35లక్షల లక్ష్యం పూర్తి చేస్తామన్నారు. అలాగే లక్‌పతి దీదీ కింద మహిళలను లక్షాధికారులను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
జక్రాన్‌పల్లి:మండలంలోని మనోహరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలయ్య కు మార్తె వివాహానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరయ్యారు.నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు.అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డిని అ య్యప్ప స్వాములు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సాయారెడ్డి,శేఖర్‌గౌడ్,అర్గుల్ నర్స య్య, అనంత్‌రెడ్డి, కాట్‌పల్లి నర్సారెడ్డి, మద్దుల రమేశ్, భాస్కర్‌రెడ్డి, ఉమ్మాజి నరేశ్, సొప్పరి వినోద్ పాల్గొన్నారు.
ధర్మారం(బి)లో క్రిస్మస్ వేడుకలు
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న ఎస్టీ జోసఫ్ స్కూల్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎఫ్‌ఆర్ మారియా రాజు, రేవఎస్‌ఆర్ రోస్లిన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment