దేశం గర్వించదగ్గ నాయకుడు వాజ్‌పేయి
సుభాష్‌నగర్ : దేశం గర్వించదగ్గ నాయకుడు అ టల్ బిహారి వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ధన్‌పా ల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా యెండల , ధన్‌పాల్ హాజరయ్యారు. రెండు ఎంపీ స్థానాలకు పరిమితమైన బీజేపీని వాజ్‌పేయి ప్రభుత్వం ఏ ర్పాటు చేసే స్థాయికి తీసుకొచ్చాడన్నారు. ఆయ న పాలనలో దేశంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశారని గుర్తు చేశారు. అటల్ జీ, అద్వానీ కలలుగన్న జాతీయ పునర్మిర్మాణ కోసం అందరూ కలిసి పని చేయాలని, మహనీయుని జయంతి రోజు ప్రజలందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గౌతమ్‌నగర్‌లోని స్నేహ సొసైటీలో పిల్లలకు ధన్‌పాల్ సూర్యనారాయణ పండ్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో నాయకులు న్యాలం రాజు, స్వామి యాదవ్, యామాద్రి భాస్కర్, బద్దం కిషన్, గంగోనె సంతోష్, దొంతుల రవి, కిషోర్ కుమార్, తారక్ వేణు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వాజ్‌పేయి శతజయంతి
నివాళులు అర్పించిన బీజేపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment