ఇందూరులో క్రిస్మస్ వేడుకలు
నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్ సిటీ/ మోపాల్/ డిచ్‌పల్లి/ జక్రాన్‌పల్లి/ ధర్పల్లి/ సిరికొండ: క్రిస్మస్ సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిలకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మత పెద్దలు వివరించారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఏసు ప్రభువు బోధనలు ఆయన చూపిన శాంతి, ప్రేమ ఎప్పటికీ ఆచరణీయమని సీఎస్‌ఐ చర్చి రెవరెండ్ సీహెచ్ జార్జ్ అన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని నగరంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను చేశారు. క్రైస్తవులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో రెవరెండ్ ప్రకాశ్, రెవరెండ్ కృపాకర్, సుధీర్ ప్రకాశ్‌రావు, జయప్రసాద్, పవన్ కుమార్, సంజు జార్జ్, మేరి జార్జ్, ప్రసన్న కుమార్, సమీయల్, శోభ, పురుషోత్తం, డేవిడ్, నరేశ్, రుబాన్, ప్రశాంత్ వినోద్ కుమార్, రవి జవన్, చర్చి కమిటీ సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఏసు ప్రభువు బోధనలు, ఆయన చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మోపాల్ మండలంలోని బోర్గాం(పి), కంజర్, మోపాల్, బాడ్సి, సింగంపల్లి, పలు గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలను విద్యుద్ధీపాలతో అలంకరించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి) క్యాథలిక్ చర్చి (పునీత లూర్థుమాత చర్చి), నడిపల్లి సీఎస్‌ఐ ఫాస్టరేట్ చర్చి విక్టోరి యా హాస్పిటల్ ఆవరణలోని సీఎస్‌ఐ చర్చితో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి, అర్గుల్, పడకల్, జక్రాన్‌పల్లి, కేశ్‌పల్లి, కలిగోట్, కొలిప్యాక్, తొర్లికొండ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను చేపట్టారు. ధర్పల్లి మండలంలో మైలారం, ధర్పల్లి, పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment