డిప్యుటేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల స్థానాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరళి కృష్ణవేణి, బట్టు బద్రినాథ్ బుధవారం పేర్కొన్నారు. కేజీబీవీ మోడల్ స్కూల్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆ పాఠశాలలలో ప్రభుత్వ ఉపాధ్యాయులని డిప్యుటేషన్‌పై పంపించాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఇందూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. న్యాయమైన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైంది కాదన్నారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాపూజీ వచనాలయ ఆస్తులు కాపాడాలి
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయాన్ని కాంట్రాక్టర్ల బారి నుంచి రక్షించాలని, వచనాలయం విద్యార్థులకే అందుబాటులో ఉండాలని సభ్యుడు కోనేరు సాయికుమార్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కోటగల్లీలోని ఎన్‌ఆర్ భవన్‌లో వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. బాపూజీ వచనాలయ పాలకవర్గంలో అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న భక్తవత్సలం నాయుడు (ఢిల్లీ) గతంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాడని ఆరోపించారు. ఆయనపై గతంలో కోర్టులో కేసులు కూడా వేశారన్నారు. ఆయన ప్రస్తుతం బాపూజీ వచనాలయం పాలకవర్గంలో చేరి సంస్థను బ్రష్టు పట్టిస్తున్నారన్నాని మండిపడ్డారు. వచనాలయ ఆదాయ, వ్యయాలు సైతం గోల్‌మాల్ చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా గెలిచిన వారిలో లిక్కర్ వ్యాపారి ఉండటం శోచనీయమన్నారు. వచనాలయంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికితీయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, ముషుబ్ పటేల్, రాజు పాల్గొన్నారు.
నేడు చందూరులో ఎమ్మెల్యే పర్యటన
వర్ని: చందూరు మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి నూతనంగా మంజూరైన 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టారు.
అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం
రెంజల్: మండలంలోని దూపల్లిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను మాలమహానాడు నాయకులు, యువకులు దహనం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మతో గ్రామంలో శవయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం ఎదటు దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు సాయిలు, అరుణ్, నవీన్, శ్రీకాంత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మను అధర్మ ప్రతుల దహనం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్‌లోని అంబేడ్కర్ చౌర స్తా వద్ద బుధవారం దళిత, బహుజన, అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో అసమానతలకు కారణమైన మను(ఆ)ధర్మ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ.. మను అధర్నాన్ని మంట కలుపుదాం.. సమ సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులు నేటికి పేద, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అందడం లేదన్నారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనాన్నారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు కొంతం మురళీధర్, మర్ల ప్రభాకర్, చిక్కు అన్న, అగ్గు క్రాంతి, చందు, కుశ్వంత్, బాబీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment