వాజ్‌పేయి ఆశయ సాధనకు కృషి చేయాలి
సుభాష్‌నగర్/ మోపాల్/ సిరికొండ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని ప్రగతినగర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారత చరిత్రలో కొద్దిమంది రాజనీతిజ్ఞు ల్లో వాజ్‌పేయి అగ్రగణ్యుడని, ప్రగతి ప్రస్థానంపై చెరగని రీతిలో శాశ్వత ముద్ర వేసిన అరుదైన దార్శనికుడు అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి న్యాలం రాజు, యామాద్రి భాస్కర్, స్వామి యాదవ్, మాస్టర్ శంకర్, బండారు యాదగిరి, ఇప్పకాయల కిశోర్, నారాయణ యాదవ్, దొంతుల రవి, తారక్ వేణు, గడ్డం రాజు, వినోద్, రాజ్‌కుమార్, రణదీశ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. నగరశివారులోని బోర్గాం(పి) 5వ డివిజన్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ, బీజేవైఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యాదల నరేశ్, తోట శాసీ్త్ర, తోఫారం భాస్కర్, దండు శ్రీకాంత్, రచ్చ ఆనంద్, కల్లెడ సదానంద్, చిట్టి పండరి, పసూల నారాయణ, సునీల్, కిరణ్, రాకేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, గోపి, మారుతి, కిరణ్, అజయ్, గంగారెడ్డి, సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
సూర్యనారాయణగుప్తా
Comments
Please login to add a commentAdd a comment