ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని భీమ్‌గ ల్ మండలం సికింద్రాపూర్–గోన్‌గొప్పుల– ముచ్కూర్ వెళ్లే రోడ్డులో సికింద్రాపూర్ చిన్నవా గు వంతెన మీద విద్యుత్ తీగలు అత్యంత ప్ర మాదకరంగా వేలాడుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ. 2.12 కోట్లతో ఈ రోడ్డు, వంతెన నిర్మాణం చేశా రు. ఏడాదిన్నర క్రితం పనులు పూర్తి అయ్యా యి. అయితే ఇక్కడ వంతెనను క్రాస్ చేస్తున్న విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ అప్రోచ్ రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ తనకు సంబంధం లేదన్నట్లుగా వదిలేశా డు. సంబంధిత అధికారులు సైతం ప్రమాదాన్ని నివారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. దీంతో అనుకోని ఘటన జరిగి ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సికింద్రాపూర్‌కు చెందిన రైతులు మూల లింగన్న, కర్క గంగాధ ర్, తాళ్ల రాజాగౌడ్, గంగా బాబుగౌడ్‌లు ‘సాక్షి’ తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
వంతెనపై వేలాడుతున్న విద్యుత్ తీగలను చూపిస్తున్న సికింద్రాపూర్ రైతులు
పట్టింపులేని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment