దేశం గర్వించదగ్గ నాయకుడు వాజ్‌పేయి
రెంజల్(బోధన్): మహిళపై సామూహిక అత్యాచారం జరపడంతో పరిస్థితి విషమించి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న గల్లీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పినా కేసులకు భయపడి కుటుంబీకులు ఆదరబాదరగా అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 40 ఏళ్ల మహిళకు వదినె వరుసయ్యే ఆడపడుచు (భర్త చెల్లెలు) ఉంది. ఆడపడుచు నిజామాబాద్‌లోని అద్దె గదిలో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఇంటికి విటులను పిలిపించుకుని మరదలిని నిజామాబాద్‌కు రప్పించుకునేది. కొంత కాలంగా గుట్టుగా ఈ వ్యవహారం సాగుతోందని తెలిసింది. అయితే బాధిత మహిళ భర్త అనారోగ్యంతో రెండు నెలల క్రితం గ్రామంలో మృతి చెందాడు. మృతుడి చెల్లైలెన వ్య భిచార గృహం నిర్వాహకురాలు అంత్యక్రియలకు వచ్చి దిశ, దిన కర్మలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మరదలిని తిరిగి నిజామాబాద్‌కు పిలిపించుకుంది. అక్కడ సామూహిక అత్యాచారం జరగడంతో పరిస్థితి విషమించి మరుసటి రోజు శనివారం బాధిత మహిళ ఇంట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. వ్యభిచార గృహం నిర్వాహకురాలు మరదలి మృత దేహాన్ని అదే రోజు ఆటోలో గ్రామానికి తీసుకొచ్చింది. అప్పటికే గల్లీలో విషయం పొక్కడం, మృతదేహంపై గాయాలు కనిపించడంతో గల్లీవాసులు అనుమానించారు. విషయాన్ని పోలీసులకు చెప్పాలని సూచించినా కుటుంబీకులు అప్పటికప్పుడు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతురాలికి కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు. కొడుకును మూడు నెలల క్రితం అప్పులు చేసి దుబాయ్ పంపించారు. దుబాయ్ వెళ్లిన నెలరోజులకే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. తల్లి మరణించడంతో తిరిగి గ్రామానికి వచ్చేశాడు.
వ్యభిచార గృహంలో ఘటన
సామూహికంగా అఘాయిత్యం
పోలీసులకు తెలపకుండా అంత్యక్రియలు
Comments
Please login to add a commentAdd a comment