మర్మమేమిటో?
వివాదాస్పద ఫైల్ కదలికలో
కోర్టులో వివాదంలో ఉన్నప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకమైన అధ్యాపకుల పదోన్నతుల ఫైల్ మళ్లీ ముందుకు కదలడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అధ్యాపకుల నియామకాలు చెల్లవని గతంలో వర్సిటీ పాలకమండలి తీర్మానం చేస్తూ క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ప్రొఫెసర్లతో నియమించిన ద్విసభ్య కమిటీ, అప్పటి గవర్నర్ వేసిన కమిటీ అధ్యాపకుల నియామకాలు అక్రమమని నివేదికలు ఇచ్చాయి.
● తెలంగాణ యూనివర్సిటీ
పాత వివాదంలో కొత్త కథ
● పూర్తి స్థాయి పాలకమండలి ఏర్పాటు కానప్పటికీ ప్రక్రియ వేగవంతం
● గతంలో అనేకసార్లు తిరస్కరిస్తూ చేసిన పాలకమండలి తీర్మానాలు బేఖాతరు
● ఈ వివాదాస్పద నియామకాల సీఏఎస్ పదోన్నతులపై గతంలోనే తిరస్కరణ
● ఒకే అంశంలో ఒక్కో ప్రొఫెసర్‌కు
ఒక్కోవిధంగా నిబంధనలు
అమలు చేస్తున్న వైనం
● వక్రమార్గాలపై గతంలోనూ అనేకసార్లు అక్షరయుద్ధం చేసిన ‘సాక్షి’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకమైన అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం పదోన్నతుల విషయంలో గతంలో పాలకమండలి అనేకసార్లు తిరస్కరించింది. ఈ అంశాలపై ‘సాక్షి’ దినపత్రిక గతంలో అక్షర యుద్ధం చేసింది. వరుస కథనాలు రాయడంతో అక్రమానికి బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆ అక్రమ వ్యవహారానికి పదును పెట్టారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫైల్ కదలికలో రూ.5 కోట్లు చేతులు మారినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం కోర్టులో ఉన్నప్పటికీ కొత్తగా మళ్లీ ఫైల్‌ను వేగంగా నడిపిస్తున్నారు. కోర్టులో ఉన్న ఈ అంశానికి సంబంధించి ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదని గతంలో పలుసార్లు పాలకమండలి తేల్చి చెప్పింది. విషయంలోకి వెళితే 2014లో అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ ఈ అధ్యాపకులను నియమించారు. ఈ నియామకాలు చెల్లవని 41వ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదరావు, భాస్కర్‌రావు అనే ఇద్దరు ప్రొఫెసర్లతో ద్విసభ్య కమిటీ వేసింది. మరోవైపు అప్పటి గవర్నర్ నరసింహన్ సైతం సీవీ రాములు కమిటీ వేశారు. ఈ రెండు కమిటీలు నియామకాలు అక్రమమని నివేదికలు ఇచ్చాయి. ఈ క్రమంలో వ్యవహారం కోర్టులో ఉండడంతో 43, 45, 48, 53 ఈసీ సమావేశాల్లో 2014 నియామకాల ప్రమోషన్లను తిరస్కరించారు. రవీందర్‌గుప్తా వీసీగా ఉన్న సమయంలో రూ.4 కోట్లతో డీల్ కుదుర్చుకుని ఫైల్ కదిపినట్లు తెలియడంతో గందరగోళం నెలకొంది. అదే సమయంలో ఇతర అక్రమాలు, అవకతవకలు, అక్రమ నియామకాల నేపథ్యంలో వర్సిటీ పరువు పోయింది. ఈ క్రమంలో కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా కాకుండానే నేరుగా ప్రొఫెసర్లుగా ఉన్నతి పొందే వ్యవహారాన్ని నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ సర్వీసును కలుపుకున్నారు. వర్సిటీలో అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలతో ప్రభుత్వాన్ని కదలించింది. ఈ క్రమంలో అప్పటి వీసీ రవీందర్‌గుప్తా 2023 జూన్‌లో ఏసీబీకి చిక్కారు. ప్రొఫెసర్ల దొడ్డిదారి ప్రమోషన్ల కథ నిలిచిపోయింది. వీసీ అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీగా ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణను నియమించింది. వాకాటి కరుణ హయాంలోనూ ఈ ఫైల్‌ను కదిలించారు. ‘సాక్షి’లో కథనం రావడంతో ఎక్కడివారక్కడే గప్‌చుప్ అయ్యారు. మళ్లీ తాజాగా ఇప్పుడు ఈ ఫైల్‌ను గుట్టుచప్పుడు కాకుండా మూవ్ చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయమై రూ.5 కోట్ల మేర డీల్ జరుగుతున్నట్లు సమాచారముందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయి పాలకమండలి ఏర్పాటు కానప్పటికీ ఇంత హడావుడిగా వివాదాస్పద ఫైల్‌ను వేగంగా మూవ్ చేస్తుండడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
● ప్రభుత్వ ప్లీడర్ వాణీరెడ్డి ఒపీనియన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ నియామకాలను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని కోరుతూ 2014 నియామక అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని అప్పటి వీసీ, రిజిస్ట్రార్‌లను పాలకమండలి ఆదేశించింది. ఇలా ప్రతి పాలకమండలి సమావేశంలో తిరస్కరణకు గురైన వివాదాస్పద నియామకాలకు విద్యాశాఖ కార్యదర్శితో ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి ఏవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకునేలా ఒప్పించారనేది ప్రశ్నార్థకంగా ఉంది. మొదటి లీగల్ ఒపీనియన్ తీసుకునేముందే పాలకమండలి అనుమతి కోరారు. మరి ఇప్పుడు పాలకమండలిని ఎందుకు మరిచారో, పూర్తి స్థాయిలో పాలకమండలి లేని సమయంలో ఆగమేఘాల మీద గుట్టుచప్పుడు కాకుండా లీగల్ ఒపీనియన్‌కు ఎందుకు పంపారనేది తెలియాలని పలువురు అంటున్నారు.
2019 మార్చి 30న జరిగిన 44వ పాలకమండలి సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావన వచ్చింది. తరువాత తమకు పదోన్నతి కల్పించాలని కోరుతూ వివాదాస్పద 2014 అభ్యర్థులు పెట్టుకున్న వినతిని 48వ పాలకమండలి సమావేశం తోసిపుచ్చింది.
● తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 2014 నియామకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి 2022 జూలై 13న లేఖ వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఇంత బేఖాతరుగా వ్యవహరిస్తున్నారు. వరంగల్‌కు చెందిన మామిడాల సుధాకర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అర్ధరాత్రి చర్చలు జరిపి అనుకూలంగా నివేదిక తీసుకున్నారు. పైగా కోర్టులో తగిన వాదన వినిపించకుండా వివాదాస్పద రీతిలో నియామకమైనవారికి అనుకూలంగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా వేగంగా పావులు కదుపుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పాలకమండలి తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ..
వర్సిటీలో అక్రమాలపై గతంలో పాలకమండలి అలుపెరగని పోరాటం చేసింది. గత వీసీ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణకు తీర్మానం చేసింది. విజిలెన్స్ విచారణ సైతం నడుస్తోంది. వాకాటి కరుణ ఇన్‌చార్జి వీసీగా ఉన్నప్పుడు పాలకమండలి సభ్యులు తిరస్కరించినప్పటికీ ప్రమోషన్ల అంశంపై లీగల్ ఒపీనియన్‌కు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వాకాటి కరుణ ఈ ప్రమోషన్ల వ్యవహారాన్ని అప్పటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి తిరస్కరించారు. తరువాత బుర్రా వెంకటేశం ఇన్‌చార్జి వీసీగా ఉన్న సమయంలో ఒక ఆదివారం రోజున వర్సిటీకి వచ్చారు. 2014 బ్యాచ్‌కు చెందిన కొందరు అధ్యాపకులు బుర్రా వెంకటేశంను రహస్యంగా కలిసి ఉద్యోగోన్నతులకు విన్నవించినట్లు ప్రచారం ఉంది.
లీగల్ ఒపీనియన్ పేరిట..
కనకయ్య విషయంలో ఒకలా
యూజీసీ నిబంధనలు ఉల్లంఘించి తనకు తానే కనకయ్య ఉద్యోగోన్నతి పొందినట్లు చూపించిన రిజిస్ట్రార్ యాదగిరి ప్రభుత్వానికి తెలిపారు. దీనిపై లోక్ అదాలత్‌లో అప్పీల్‌కు వెళ్లారు. ఇదిలా ఉండగా మరో నలుగురు ప్రొఫెసర్ల విషయంలో మాత్రం అప్పీలుకు వెళ్లకుండా ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఒకే అంశంలో కనకయ్య విషయంలో ఒకలా.. మిగిలిన వాళ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.
2014 నియామకాలు ఆది నుంచీ వివాదాస్పద మే. పలు ఆరోపణల నేపఽథ్యంలో 2012 ఏడాది చివరిలో ఇంటర్వ్యూలు నిర్వహించి, 2013 ఫిబ్రవరిలో నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుబాటులో ఉన్నవాళ్లను జాయిన్ చేసుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స దరు నియామకాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నియామకాల్లో అక్రమాలపై విద్యార్థి సంఘాలు సాక్ష్యాలు బయటపెట్టగా పత్రికల్లో వార్త లు వచ్చా యి. అలాగే అర్హత ఉన్నప్పటికీ ఎంపిక కాని కొందరు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వగా, ఇక్కడే పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెం ట్లూ ఆందోళనకు దిగారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియామకాలపై సమగ్ర విచారణ జరి పేందుకు 2013 ఫిబ్రవరి 22న ఇద్దరు సభ్యుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 25న ఈ నియామకాలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువరించవద్దని అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే స మయంలో అటు అకడమిక్ కన్సల్టెంట్లు సైతం ఈ నియామకాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రోజురోజుకూ వివాదాస్పదంగా తయారైంది. ఈ విషయమై జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికపై అప్పటి గవర్నమెంట్ ప్లీడర్ (ఉన్నత విద్యాశాఖ) సి వాణిరెడ్డి ద్వారా లీగల్ ఒపీనియన్ కోరుతూ 41వ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఈ నియామకాలపై జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 2018 సెప్టెంబర్ 26న జరిగిన పాలకమండలి సమావేశంలో జస్టిస్ సీవీ రాము లు ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన పాలకమండలి, ఆయా నియామకాల్లో అక్ర మాలు జరిగాయని గుర్తించింది. తీవ్రంగా పరిగణించి సద రు నియామకాలు చేపట్టిన అప్పటి వీసీ ఆచార్య అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ఆచార్య అశోక్‌లపై ఉస్మానియా యూనివర్సిటీ సర్వీస్ రూల్స్ ప్రకా రం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వర్సిటీకి లేఖ రాయాలని తెలంగాణ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లను పాలకమండలి సభ్యులు ఆదేశించారు. పైగా అక్బర్ అలీఖాన్ పెన్షన్ బెనిఫిట్స్‌ను పూర్తిగా ని లిపేయాలని, అశోక్‌ను సర్వీస్ నుంచి తొలగించా లని ఉస్మానియా వర్సిటీకి లేఖ రాయా లని నిర్ణయించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను ఉ స్మానియా వర్సిటీ నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. జస్టిస్ సీవీ రాములు నివేదిక ప్రకారం అక్బర్ అలీ ఖాన్, అశోక్‌లపై సత్వరమే క్రిమినల్ కేసు పెట్టాల ని వర్సిటీ వీసీ ఆచార్య సాంబయ్య, రిజిస్ట్రార్ బలరాములు లను పాలకమండలి ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment