కాంగ్రెస్ భవన్ ముట్టడి
● బీజేపీ, బీజేవైఎం నాయకుల అరెస్టు
● నగరంలోని కాంగ్రెస్ భవన్ వద్ద
పోలీసు బందోబస్తు
నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌ను బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. బుధవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ భవన్‌కు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కాషాయ కార్యకర్తలు వచ్చారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం నాయకు లు మాట్లాడుతూ.. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించడ మే కాకుండా అడ్డువచ్చిన సాధారణ కార్యకర్తలపై దాడిచేయడం హేయమైన చర్యఅని అన్నారు. నిరసనగా కాంగ్రెస్ భవన్ ముట్టడికి యత్నించి నట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. కాంగ్రెస్ భవన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment