అర్బన్ అభివృద్ధి వేగంగా జరగాలి
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అబివృద్ధి వేగంగా జరిగేలా పాటుపాడాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. కలెక్టర్ రాజీవ్‌గాందీ హనుమంతుతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులకు విడుదలైన రూ.1.25 కోట్లతో వెంటనే పనులను ప్రారంభించి మళ్లీ అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. నగర ప్రజల ఆరోగ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన అహ్మదీబజార్, ఖలీల్‌వాడిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ల పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే నియోజకవర్గానికి మంజూరైన రూ.60కోట్లతో డివిజన్‌ల వారీగా పనులు చేపట్టేందుకు టెండర్లను పిలవాలని కోరారు. నగరంలో కబ్జాలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు ఇ బ్బందులకు పడుతున్నారని, కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్‌పాత్ కబ్జాలు, రోడ్లపై వి చ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తోపుడు బండ్లతో రోడ్లపై వ్యాపా రం చేస్తున్న వారికి ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయించాలని సూచించారు. స్మార్ట్ సిటీ కోసం ఎంపీతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీ విధివిధానాలకు అనుగుణంగా ఇందూరు నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని, అందుకు ప్రజలు సైతం సహకరించాలని అన్నారు. కలెక్టర్‌తో సమావేశమైన వారిలో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమా ర్, ఇంజినీరింగ్ విభాగం ఈఈలు సురేశ్, ప్రవీణ్, మురళి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మరమ్మతులు
ప్రారంభించండి
రూ.60కోట్లతో డివిజన్‌ల వారీగా
అభివృద్ధి పనులు చేపట్టాలి
కలెక్టర్ హనుమంతుతో
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
Comments
Please login to add a commentAdd a comment